హింసాత్మక మరియు గ్రాఫిక్ కంటెంట్

విధానానికి సంబంధించిన వివరాలు

మార్పులు, చేర్పుల వివరాలు
విధానానికి కారణం
వ్యక్తులు చిత్రిత మరియు హింసాత్మక చిత్రాలకు సంబంధించి వేర్వేరు స్థాయిల సున్నితత్వాన్ని కలిగి ఉంటారని మేము అర్థం చేసుకున్నాము. అటువంటి కంటెంట్ నుంచి వినియోగదారులను రక్షించడానికి, మేము అత్యంత గ్రాఫిక్ కంటెంట్‌ను తీసివేస్తాము మరియు ఇతర రకాల కంటెంట్‌కు హెచ్చరిక లేబుల్‌లను జోడిస్తాము, దీని వల్ల వ్యక్తులు దాన్ని క్లిక్ చేసే ముందే ఇది గోప్యమైనదని వారికి తెలుస్తుంది. మేము యువతకు సరికాని లేదా వయస్సుకు అనుగుణంగా లేని కంటెంట్‌ను చూడగల వారి యొక్క సామర్థ్యాన్ని పరిమితం చేస్తాము. అలా చేయడం ద్వారా, మేము తగిన యూజర్ అనుభవాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాము, తద్వారా మా యూజర్‌లు తమను తాము వ్యక్తపరచుకోవడానికి వారికి ఒక స్పేస్‌ను అందించడం కొనసాగిస్తాము.
మానవ హక్కుల దుర్వినియోగాలు లేదా సాయుధ సంఘర్షణ వంటి చర్యలపై దృష్టి సారించడానికి లేదా వాటిని ఖండించడానికి వినియోగదారులు కంటెంట్‌ను షేర్ చేయవచ్చని మేము గుర్తించాము. కంటెంట్ ఈ సందర్భంలో షేర్ చేయబడినప్పుడు మా విధానాలు పరిగణనలోకి తీసుకుంటాయి మరియు చర్చించడానికి, తదనుగుణంగా అవగాహనను పెంపొందించడానికి అనుమతిస్తాయి.
చెల్లింపు ప్రకటనల కోసం, మేము అదనపు రక్షణ అంశాలను అందిస్తాము. ఉదాహరణకు, సున్నితంగా ఉన్నట్లు పరిగణించబడే కంటెంట్‌ను యాడ్‌లలో ప్రదర్శించడానికి అర్హత లేదు. మేము యాడ్‌లలో దిగ్భ్రాంతికరమైన, విసుగు పుట్టించే లేదా సహజంగా సంచలనాత్మకమైన ఇమేజ్‌లు, వీడియోలు ఉండకుండా కూడా వాటిని నిషేధిస్తాము. మరింత సమాచారం కోసం, దయచేసి మా అడ్వర్టయిజింగ్ విలువలు, ప్రమాణాలు చూడండి.
వీటిని పోస్ట్ చేయకండి:
వ్యక్తుల ఇమేజ్‌లు
వైద్యేతర సందర్భాలలో జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల వీడియోలు, క్రింది వాటిని వర్ణించేవి:
  • విచ్ఛేదనం.
  • జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తులకు సంబంధించి బయటికి కనిపిస్తున్న అవయవాలు, ఎముకలు లేదా కండరాల కణజాలం వంటి బయటికి కనిపిస్తున్న అంతర్గత అవయవాలు;
  • కాలిపోతున్న లేదా కాలిపోయిన వ్యక్తులు; లేదా
  • గొంతు-కోయడం.
మరణశిక్షకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు.
హింసాత్మకమైన వ్యాఖ్యలు
వ్యక్తులు లేదా జంతువులు పడే బాధ లేదా వారి/వాటి పట్ల అమానుషంగా ప్రవర్తించడం ద్వారా ఆనందాన్ని లేదా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న – క్యాప్షన్‌లు లేదా కామెంట్‌ల వంటి – హింసాత్మక వ్యాఖ్యలను కామెంటరీగా అంటారు.
మేము వీటిని తీసివేస్తాము
  • ఇమేజ్‌లు స్వీయ రక్షణను (ఉదా., సాయుధులుగా వచ్చి దోపిడీ చేస్తుండగా, వారి నుండి తమను తాము రక్షించుకుంటున్న వారి వీడియో) వర్ణిస్తుంటే లేదా వైద్యపరమైన సందర్భంలో (ఉదా., వైద్యపరమైన నిపుణులు శస్త్రచికిత్స చేస్తున్న ఇమేజ్) ఉంటే మినహా మిగిలిన సందర్భాలలో; కంటెంట్ సున్నితంగా ఉండవచ్చని వ్యక్తులకు సూచిస్తూ, ఈ విధానం క్రింద హెచ్చరిక స్క్రీన్‌ను చూపే ఇమేజ్‌లపై (వీడియోలు మరియు స్టిల్ ఇమేజ్‌లు రెండూ) చేసిన హింసాత్మక వ్యాఖ్యలు.
  • ఇమేజ్‌లలో వర్ణించబడిన జంతువుల బాధ పట్ల చేసిన స్పష్టమైన హింసాత్మక వ్యాఖ్యలు మరియు ప్రాణం ఉండగా చంపేందుకు తీసుకెళ్లే జంతువులను వర్ణించే ఇమేజ్‌లు.
  • హింసాత్మకమైన వ్యాఖ్యలను కలిగి ఉన్నప్పుడు ఈ విధానం క్రింద తొలగించబడిన లేదా హెచ్చరిక స్క్రీన్‌ను చూపే ఇమేజ్‌లను అందించడం లేదా అభ్యర్థించడం.
మేము క్రింది కంటెంట్‌కు సంబంధించి, కంటెంట్ సున్నితంగా ఉండవచ్చని వ్యక్తులకు తెలియజేసేలా హెచ్చరిక స్క్రీన్‌ని చేరుస్తాము. మేము 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు కంటెంట్‌ను వీక్షించే సామర్థ్యాన్ని కూడా పరిమితం చేస్తాము:
వ్యక్తుల ఇమేజ్‌లు
వీటిని వర్ణిస్తున్న వైద్యపరమైన సందర్భాలలో జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల వీడియోలు:
  • విచ్ఛేదనం.
  • జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తులకు సంబంధించి బయటికి కనిపిస్తున్న అవయవాలు, ఎముకలు లేదా కండరాల కణజాలం వంటి బయటికి కనిపిస్తున్న అంతర్గత అవయవాలు;
  • దహనం చేసే సందర్భాలతో సహా, కాలుతున్న లేదా కాలిపోయిన వ్యక్తులు; లేదా
  • గొంతు-కోయడం.
వీటిని వర్ణిస్తున్న జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల స్టిల్ ఇమేజ్‌లు:
  • విచ్ఛేదనం.
  • జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తులకు సంబంధించి బయటికి కనిపిస్తున్న అవయవాలు, ఎముకలు లేదా కండరాల కణజాలం వంటి బయటికి కనిపిస్తున్న అంతర్గత అవయవాలు;
  • కాలిపోతున్న లేదా కాలిపోయిన వ్యక్తులు; లేదా
  • గొంతు-కోయడం.
ఒక వ్యక్తి హంసాత్మక మరణాన్ని వివరించే (వారు చనిపోతున్న క్షణం లేదా మరణానంతర పరిణామాలతో సహా) లేదా ఒక వ్యక్తి యొక్క జీవన్మరణ పోరాటాన్ని (కారులో ఇరుక్కుపోవడం, చాలా ఎత్తు నుండి పడిపోవడం లేదా ప్రాణాంతకం అవ్వగల శారీరక గాయాన్ని అనుభూతి చెందడం) వర్ణిస్తున్న ఇమేజ్‌లు (వీడియోలు మరియు స్టిల్ ఇమేజ్‌లు రెండూ).
ఒక వ్యక్తి మరణశిక్షను (ప్రత్యక్ష ప్రసారాలు మినహాయించి) వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంపై కృూరత్వ చర్యలను (ఉదా., హింసాత్మక చర్యలు లేదా ప్రాణాంతకమైన బెదిరింపులతో దౌర్జన్యంగా అణచివేయడం) వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
వైద్యేతర సందర్భంలో ఒక వ్యక్తి చర్మాన్ని గుచ్చుతున్న అసంబద్ధమైన వస్తువులను (ఉదా. కత్తులు, మేకులు లేదా ఇతర లోహపు వస్తువులు) వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
ఒక వ్యక్తి యొక్క విరిగిన, రక్తం కారుతున్న దంతాలు, తీసివేసిన తర్వాత రక్తం అంటుకుని ఉన్న దంతాలు; లేదా దంతాలు లేదా చిగుళ్లలో అసంబద్ధమైన వస్తువులను చొప్పించడాన్ని వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
మరొక వ్యక్తి ఇమేజ్‌లో ఉంటే మినహా మిగిలిన సందర్భాలలో చనిపోయి గర్భం వెలుపలికి వచ్చిన పిండాలు మరియు శిశువులను వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
జంతువుల ఇమేజ్‌లు
విచ్ఛేదనం, బయటికి కనిపిస్తున్న అంతర్గత అవయవాలు, కాలుతున్న లేదా మండుతున్న లేదా జీవించి ఉండగానే ఉడకబెట్టడాన్ని వర్ణిస్తున్న – జీవించి ఉన్న లేదా చనిపోయిన జంతువుల యొక్క ఏవైనా ఇమేజ్‌లు.
ప్రాణాన్ని విడుస్తూ మరణానికి చేరువవుతున్న జంతువుల ఇమేజ్‌లు.
జీవించి ఉన్న జంతువులపై క్రూరమైన చర్యలకు ఉపక్రమిస్తున్న మనుషుల ఇమేజ్‌లు (ఉదా. కొట్టడం, నీటిలో ముంచడం లేదా ఈకలు పీకడం).
క్రింది కంటెంట్‌కు సంబంధించి, దానిని చూసే సామర్థ్యాన్ని మేము 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు పరిమితం చేస్తాము:
వ్యక్తుల ఇమేజ్‌లు
హింసాత్మక మరణాన్ని సూచించేలా స్పష్టమైన సూచికలు లేనప్పటికీ, పాక్షికంగా లేదా పూర్తిగా కప్పబడని మరణించిన వ్యక్తులను చూపుతున్న ఇమేజ్‌లు.
మరొక వ్యక్తి ఇమేజ్‌లో ఉన్నప్పుడు మిగిలిన సందర్భాలలో చనిపోయి గర్భం వెలుపలికి వచ్చిన పిండాలు మరియు శిశువులను వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
వ్యాక్సినేషన్, ఆక్యుపంక్చర్ లేదా డ్రై-నీడిలింగ్, పచ్చబొట్టు వేయించుకోవడం లేదా పియర్సింగ్ వంటి సందర్భాలలో కాకుండా వ్యక్తి చర్మంలోకి సూదులు గుచ్చడాన్ని చూపుతున్న చిత్రాలు.
వైద్యపరమైన సందర్భాల్లో గాయపడిన వ్యక్తులు నొప్పిని లేదా బాధను అనుభవిస్తున్నట్లు, గాయాలైనట్లు లేదా వారి ముఖం మరియు/లేదా చేతులపై మెడికల్ ట్యూబింగ్ ఉన్నట్లు వారు కనిపించినప్పుడు ఆ సందర్భాలను వివరిస్తున్న ఇమేజ్‌లు.
మానవ వ్యర్థం మరియు శారీరక ద్రవాలను (ఉదా. మలం, మూత్రం, వాంతి, గులిమి, శ్లేష్మం, చర్మం ఊడేటప్పుడు ఉత్పత్తి అయ్యే పదార్థం లేదా రక్తం) చూపుతున్న చిత్రాలు.
కాలిపోతున్న లేదా పేలుతున్న వాహనాలను చూపుతున్న లేదంటే ఏదైనా వాహనం వెళ్లాల్సిన మార్గం నుండి పక్కకు పడిపోవడం మరియు / లేదా వాహనంలోని డ్రైవర్ లేదా ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లు తీవ్రంగా దెబ్బతినడం వంటివి జరిగేలా వేగంగా వెళ్తున్న వాహనాలు ఇతర ఆబ్జెక్ట్‌లను గుద్దుకున్నప్పటి ఘటనను లేదా గుద్దుకున్న తర్వాత జరిగే పరిణామాలను చూపుతున్న చిత్రాలు.
జంతువుల ఇమేజ్‌లు
రక్తం కనిపిస్తుండగా జీవించి ఉన్న లేదా మరణించిన జంతువులను వివరిస్తున్న ఇమేజ్‌లు.
జన్మనిస్తున్న సందర్భంలో (ఉదా. రక్తం లేదా అంతర్గత భాగాలు కనిపిస్తున్నాయి) జంతువులను చూపుతున్న చిత్రాలు.
జీవించి ఉన్న లేదా మరణించిన జంతువుల నుండి కీటకాలు (ఉదా. క్రిములు లేదా పురుగులు) బయటకు వస్తున్నట్లు చూపుతున్న ఇమేజ్‌లు.
గాయపడిన జంతువులు పడుతున్న బాధను వర్ణిస్తున్న ఇమేజ్‌లు.
కల్పిత ఇమేజ్‌లు
క్రింది సందర్భాలలోని కల్పిత వ్యక్తులను వర్ణిస్తున్న ఇమేజ్‌లు:
  • అంగ విచ్ఛేదనం;
  • బయటికి కనిపిస్తున్న అవయవాలు, ఎముకలు లేదా కండరాల కణజాలం వంటి కనిపించే అంతర్గత భాగాలు;
  • కాలిపోతున్న లేదా మసైపోయిన్ వ్యక్తులు;
  • గొంతు-కోయడం; లేదా
  • హింసాత్మక మరణాలు లేదా ప్రాణాపాయ సంఘటనలు.
క్రింది సందర్భాలలో ఫోటోరియలిస్టిక్‌గా ఉన్న కాల్పనిక వ్యక్తిని వర్ణిస్తున్న ఇమేజ్‌లు (నిజమైన వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్ లేదా వీడియోను పోలి ఉన్నట్లు లేదా వాటికి దగ్గరగా ఉన్నట్లు అనిపించే ఇమేజ్‌లు):
  • చర్మంలోకి గుచ్చుతున్న వైద్యపరం కాని అసంబద్ధమైన వస్తువులు (ఉదా. కత్తులు, మేకులు లేదా ఇతర లోహపు వస్తువులు);
  • మానవ వ్యర్థం లేదా రక్తం కాకుండా, శారీరక ద్రవాలు (ఉదా. మలం, మూత్రం, వాంతి, గులిమి, శ్లేష్మం, చర్మం ఊడేటప్పుడు ఉత్పత్తి అయ్యే పదార్థం);
  • గర్భం బయట మరణించిన శిశువులు లేదా పిండాలు;
క్రింది సందర్భాలలోని కల్పితం అయినప్పటికీ, ఫోటోరియలిస్టిక్, జంతువులను చూపుతున్న చిత్రాలు:
  • అంగ విచ్ఛేదనం;
  • బయటికి కనిపిస్తున్న అవయవాలు, ఎముకలు లేదా కండరాల కణజాలం వంటి కనిపించే అంతర్గత భాగాలు;
  • కాలిపోతున్న లేదా మసైపోయిన జంతువులు;
  • జీవించి ఉండగానే జంతువులను ఉడకబెట్టడం;
  • రక్తం కనిపిస్తూ ఉండటం;
  • జంతువులు ప్రాణాన్ని విడుస్తూ, మరణానికి చేరువౌవుతుండటం;
  • జీవించి ఉన్న జంతువులపై క్రూరత్వ చర్యలకు ఉపక్రమిస్తున్న వ్యక్తులు (ఉదా., కొట్టడం, నీటిలో ముంచడం లేదా ఈకలు పీకడం);
  • గాయాలతో బాధపడుతున్న జంతువులు
  • వాటి శరీరం నుండి కీటకాలు బయటికి వస్తున్న జంతువులు (ఉదా., క్రిములు లేదా పురుగులు).
క్రింది సామాజిక విలువలు, ప్రమాణాలకు సంబంధించి, వీటిని అమలు చేయడానికి మాకు అదనపు సమాచారం మరియు/లేదా సందర్భం కావాలి:
మేము వీటిని అనుమతించము:
చట్టాన్ని అమలు చేసే సంస్థ యొక్క రికార్డు, మరణ ధృవీకరణ పత్రం, విశ్వసనీయ భాగస్వామి రిపోర్ట్ లేదా మీడియా రిపోర్ట్ మరియు మరణించిన వారి కుటుంబ సభ్యుల అభ్యర్థనల ద్వారా ఒక వ్యక్తి యొక్క మరణాన్ని నిర్ధారించినప్పుడు ఆ వ్యక్తి యొక్క హింసాత్మక మరణానికి సంబంధించిన ఇమేజ్‌లు లేదా ఆడియో.
నిరసన చర్యగా స్వీయ దహన సందర్భంలో కాలిన లేదా కాలిపోతున్న మనుషుల వీడియో.
మేము వీటిని అనుమతించవచ్చు:
ఒక వ్యక్తి యొక్క దారుణమైన మరణం లేదా ప్రాణాంతక సంఘటన యొక్క వర్ణన అనేది ఉద్దేశ్యపూర్వకంగా లేనప్పుడు దానికి సంబంధించిన ఇమేజ్‌లు
వినియోగదారు అనుభవాలు
Facebookలోని వ్యక్తులకు అమలు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూడండి, వాటిలో: Facebookలో ఉండకూడదని మీరు భావించే ఏదైనా విషయం గురించి ఫిర్యాదు చేయడం, మీరు మా సామాజిక విలువలు, ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తెలియజేయబడటం మరియు నిర్దిష్ట కంటెంట్‌పై హెచ్చరిక స్క్రీన్‌ను చూడటం వంటివి ఉంటాయి.
గమనిక: మేము ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నాము, కాబట్టి మీరు ఇక్కడ చూసేది మేము ప్రస్తుతం ఉపయోగిస్తున్న దానితో పోలిస్తే కొంచెం పాతది కావచ్చు.
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేయడం
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేసిన తర్వాత జరిగే కమ్యూనికేషన్
వినియోగదారు అనుభవం
ఉపసంహరణ అనుభవం
వినియోగదారు అనుభవం
హెచ్చరిక స్క్రీన్‌లు
డేటా
తాజా సామాజిక విలువలు, ప్రమాణాల అమలు రిపోర్ట్‌ను వీక్షించండి
అమలు
Facebookలో అందరికీ మేము ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాలను కలిగి ఉన్నాము.
సమీక్ష బృందాలు
Facebookలోని వ్యక్తులను సురక్షితంగా ఉంచడానికి 15,000 మంది సమీక్షకులతో కూడిన మా గ్లోబల్ బృందం ప్రతిరోజూ పని చేస్తుంది.
వాటాదారు ఎంగేజ్‌మెంట్
Facebook సామాజిక విలువలు, ప్రమాణాలను తెలియజేయడంలో బయటి నిపుణులు, విద్యావేత్తలు, NGOలు మరియు విధాన రూపకర్తలు సహాయపడతారు.
హింసాత్మక మరియు గ్రాఫిక్ కంటెంట్‌కు సంబంధించి సహాయం పొందండి
మా సామాజిక విలువలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేనినైనా మీరు Facebookలో చూసినట్లయితే, మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి.
మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి