స్థానికంగా చట్టవిరుద్ధమైన కంటెంట్, ఉత్పత్తులు లేదా సేవలు

విధానానికి సంబంధించిన వివరాలు

మార్పులు, చేర్పుల వివరాలు
విధానానికి కారణం
మా సేవలలోని కంటెంట్ స్థానిక చ్టాటలకు విరుద్ధంగా ఉన్నట్లు రెగ్యులేటర్‌లు లేదా ప్రభుత్వం విశ్వసించినప్పుడు, కంటెంట్‌ను పరిమితం చేయవలసిందిగా వారు మమ్మల్ని అడగవచ్చు. ప్రభుత్వేతర సంస్థలు మరియు పబ్లిక్ సంస్థల సభ్యులు కంటెంట్ చట్టవిరుద్ధంగా ఉంది అని పేర్కొంటూ రిపోర్ట్‌లను కూడా పంపవచ్చు. మేము న్యాయస్థాన ఉత్తర్వులను కూడా స్వీకరించవచ్చు.
మేము రిపోర్ట్ లేదా ఆర్డర్‌ను స్వీకరించినప్పుడు, మేము ముందుగా కమ్యూనిటీ ప్రమాణాలకు అది వ్యతిరేకంగా ఉందేమో అని పరిశీలిస్తాము. కంటెంట్ మా విధానాలకు విరుద్ధంగా ఉన్నట్లుగా మేము గుర్తించినట్లయితే, మేము దానిని తీసివేస్తాము. కంటెంట్ మా విధానాలకు విరుద్ధంగా లేనట్లయితే, గ్లోబల్ నెట్‌వర్క్ ఇనిషియేటివ్ మరియు మా కార్పొరేట్ మానవ హక్కుల విధానంలో సభ్యులుగా మా నిబద్ధతలకు అనుగుణంగా, రిపోర్ట్ చెల్లుబాటు అవుతుందో లేదో నిర్ణయించడానికి మేము మానవ హక్కులతో పాటుగా న్యాయ సమీక్షను జాగ్రత్తగా నిర్వహిస్తాము.
రిపోర్ట్‌లు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని, చాలా విస్తృతంగా ఉన్నాయని లేదా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్న సందర్భాల్లో, మేము వివరణను కోరడం లేదా ఎటువంటి చర్య తీసుకోకపోవడం చేయవచ్చు.
మేము మా కమ్యూనిటీ ప్రమాణాలకు బదులుగా స్థానిక చట్టం ఆధారంగా వినియోగదారు కంటెంట్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే సందర్భాలలో, మేము సాధారణంగా కంటెంట్ చట్టవిరుద్ధమని ఆరోపించబడిన అధికార పరిధిలో మాత్రమే యాక్సెస్‌ని నియంత్రించడానికి ప్రయత్నించడంతో పాటు ఎటువంటి ఇతర జరిమానాలు లేదా ఫీచర్ పరిమితులను విధించము. మేము ప్రభావిత వినియోగదారుకు కూడా తెలియజేస్తాము.
స్థానిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్న కంటెంట్‌కు సంబంధించిన రిపోర్ట్‌లను మేము ఎలా అంచనా వేస్తాము, అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్న అటువంటి సందర్భాలలో మేము కంటెంట్‌కు యాక్సెస్‌ను పరిమితం చేసిన సందర్భాలను వివరించే రిపోర్ట్‌లను కూడా మేము ప్రచురిస్తాము.
వినియోగదారు అనుభవాలు
Facebookలోని వ్యక్తులకు అమలు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూడండి, వాటిలో: Facebookలో ఉండకూడదని మీరు భావించే ఏదైనా విషయం గురించి ఫిర్యాదు చేయడం, మీరు మా సామాజిక విలువలు, ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తెలియజేయబడటం మరియు నిర్దిష్ట కంటెంట్‌పై హెచ్చరిక స్క్రీన్‌ను చూడటం వంటివి ఉంటాయి.
గమనిక: మేము ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నాము, కాబట్టి మీరు ఇక్కడ చూసేది మేము ప్రస్తుతం ఉపయోగిస్తున్న దానితో పోలిస్తే కొంచెం పాతది కావచ్చు.
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేయడం
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేసిన తర్వాత జరిగే కమ్యూనికేషన్
వినియోగదారు అనుభవం
ఉపసంహరణ అనుభవం
వినియోగదారు అనుభవం
హెచ్చరిక స్క్రీన్‌లు
అమలు
Facebookలో అందరికీ మేము ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాలను కలిగి ఉన్నాము.
సమీక్ష బృందాలు
Facebookలోని వ్యక్తులను సురక్షితంగా ఉంచడానికి 15,000 మంది సమీక్షకులతో కూడిన మా గ్లోబల్ బృందం ప్రతిరోజూ పని చేస్తుంది.
వాటాదారు ఎంగేజ్‌మెంట్
Facebook సామాజిక విలువలు, ప్రమాణాలను తెలియజేయడంలో బయటి నిపుణులు, విద్యావేత్తలు, NGOలు మరియు విధాన రూపకర్తలు సహాయపడతారు.
స్థానికంగా చట్టవిరుద్ధమైన కంటెంట్, ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించి సహాయం పొందండి.
మా సామాజిక విలువలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేనినైనా మీరు Facebookలో చూసినట్లయితే, మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి.
మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి