అప్రామాణిక ప్రవర్తన

విధానానికి సంబంధించిన వివరాలు

మార్పులు, చేర్పుల వివరాలు
విధానానికి కారణం
అప్రామాణిక ప్రవర్తన అనేది వంచనకు సంబంధించి వివిధ రకాల సంక్లిష్ట రూపాలను సూచిస్తుంది, ఇది Meta లేదా మా కమ్యూనిటీని మోసం చేసే లేదంటే సామాజిక విలువలు, ప్రమాణాలు ప్రకారం ఏదైనా అమలు చర్య నుండి తప్పించుకునే లక్ష్యంతో ఒకే వ్యక్తి లేదా వ్యక్తులు నియంత్రించే అప్రామాణిక అసెట్‌ల నెట్‌వర్క్ ద్వారా నిర్వహించబడుతుంది.
ఉద్దేశపూర్వక సైబర్ దాడి చేసే వ్యక్తులు తప్పుడు గుర్తింపులను ఉపయోగించి అత్యాధునిక అప్రామాణిక ప్రవర్తనలో ఎంగేజ్ అయ్యే సందర్భాలలో, వారు మేము సమన్వయ అప్రామాణిక ప్రవర్తన (CIB)గా నిర్వచించిన వాటిలో పాల్గొంటారు.
ఈ అమలు చర్యలు మరియు ప్రమాణాలు కంటెంట్ లేదా భావజాలంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి, ఇవి వ్యక్తులు తాము ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులను, కమ్యూనిటీలను విశ్వసించగలిగే వాతావరణాన్ని సృష్టించేలా డిజైన్ చేయబడ్డాయి.
మేము ఈ నెట్‌వర్క్‌లను గుర్తించినప్పుడు, ఆ కార్యకలాపంలో నేరుగా పాల్గొన్న నకిలీ ఖాతాలు, పేజీలు, గ్రూప్‌లు లేదా ఇతర Meta అసెట్‌లను తొలగిస్తాము. ఈ వ్యక్తులు ఉల్లంఘన ప్రవర్తనలో పాల్గొనని ప్రామాణిక సంస్థలను సూచించే పేజీలు, గ్రూప్‌లు లేదా కమ్యూనిటీలు వంటి వాటిని క్రియేట్ చేయడం, నిర్వహించడం, సహకరించడం, లక్ష్యంగా చేసుకోవడం లేదా నియంత్రించడం వంటివి చేసే సందర్భాలలో, ఉల్లంఘించే వ్యక్తులను తొలగించడానికి మేము చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రమేయం లేని వ్యక్తులు మరియు కమ్యూనిటీలు మా సేవలలో కొనసాగడానికి అనుమతిస్తాము.
సాధ్యమైనప్పుడు, మేము CIB నెట్‌వర్క్‌లకు సంబంధించిన మా పరిశోధనలను ఇక్కడ లభించే మా త్రైమాసిక ప్రత్యర్థి ముప్పు రిపోర్ట్‌లలో షేర్ చేస్తాము. ఈ రిపోర్ట్‌లు అనేవి అప్రామాణిక ప్రవర్తన విధానం ప్రకారం జరిగే అమలుకు సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తిగా కవర్ చేయడానికి ఉద్దేశించినవి కావు, కానీ మేము ఈ వేదికలో ఎదుర్కొనే బెదిరింపుల యొక్క పరిణామపూర్వక స్వభావంపై మా కమ్యూనిటీకి ఉన్న అవగాహనను తెలియజేయడంలో సహాయపడతాయి.
మేము వీటిని అనుమతించము:
క్రింద పేర్కొన్న పనులను చేయడం కోసం అప్రామాణిక Meta అసెట్‌లను (ఖాతాలు, పేజీలు, గ్రూప్‌లు) సృష్టించడం, ఉపయోగించడం లేదా క్లెయిమ్ చేసిన విధంగా ఉపయోగించడం:
  • ఆడియన్స్ లేదా వారు ప్రాతినిధ్యం వహించే ఎంటిటీ గుర్తింపు లేదా మూలం వంటి వాటి గురించి Metaని లేదా మా వినియోగదారులను మోసగించడం
  • కమ్యూనిటీ ప్రమాణాల ప్రకారం వర్తించే అమలు చర్య నుండి తప్పించుకోవడం.
  • ఇతరులను వేధించడానికి, భయపెట్టడానికి లేదా నిశ్శబ్దంగా ఉంచడానికి Meta రిపోర్టింగ్ సిస్టమ్‌లను దుర్వినియోగం చేయడం.
క్రింది సామాజిక విలువలు, ప్రమాణాలకు సంబంధించి, వీటిని అమలు చేయడానికి మాకు అదనపు సమాచారం మరియు/లేదా సందర్భం కావాలి:
మేము వీటిని అనుమతించము:
  • ఆపరేషన్‌కు కేంద్రంగా తప్పుడు గుర్తింపులను కలిగి ఉండడంతో పాటు గుర్తింపును తప్పించుకోవడానికి లేదా ప్రామాణికంగా కనిపించడానికి ఆపరేటర్‌లు విరుద్ధమైన పద్ధతులను ఉపయోగించే అప్రామాణిక ప్రవర్తన యొక్క అధునాతన రూపాలుగా నిర్వచించబడినటువంటి సమన్వయ అప్రామాణిక ప్రవర్తనలో ఎంగేజ్ అయినట్లు లేదా ఎంగేజ్ అయినట్లు క్లెయిమ్ చేసుకునే ఎంటిటీలు; మరియు
  • ఆపరేషన్ లక్ష్యం చేసుకునే ఆడియన్స్ ఉండే అదే దేశంలో నెట్‌వర్క్ ఆపరేటర్‌లు లేకుండా ఉండేటటువంటి సమన్వయ అప్రామాణిక ప్రవర్తనగా నిర్వచించబడిన విదేశీ జోక్యం వంటి చర్యలకు పాల్పడే లేదా పాల్పడతామని క్లెయిమ్ చేసే ఎంటిటీలు
  • యు.ఎన్ చార్టర్‌లోని ఆర్టికల్ 2(4) ఉల్లంఘనకు సంబంధించి మరొక రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై దాడి చేసే సందర్భంలో ప్రోద్భలంతో కూడిన లేదా హింసాత్మక ఘటనలకు పాల్పడటాన్ని నిరాకరించడం కోసం తమ అధికారిక శాఖలు, ఏజెన్సీలు మరియు ఎంబసీలను ఉపయోగించడానికి సామాజిక మాధ్యమంలో నిరంతర బ్లాక్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు.
వినియోగదారు అనుభవాలు
Facebookలోని వ్యక్తులకు అమలు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూడండి, వాటిలో: Facebookలో ఉండకూడదని మీరు భావించే ఏదైనా విషయం గురించి ఫిర్యాదు చేయడం, మీరు మా సామాజిక విలువలు, ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తెలియజేయబడటం మరియు నిర్దిష్ట కంటెంట్‌పై హెచ్చరిక స్క్రీన్‌ను చూడటం వంటివి ఉంటాయి.
గమనిక: మేము ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నాము, కాబట్టి మీరు ఇక్కడ చూసేది మేము ప్రస్తుతం ఉపయోగిస్తున్న దానితో పోలిస్తే కొంచెం పాతది కావచ్చు.
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేయడం
వినియోగదారు అనుభవం
ఫిర్యాదు చేసిన తర్వాత జరిగే కమ్యూనికేషన్
వినియోగదారు అనుభవం
ఉపసంహరణ అనుభవం
వినియోగదారు అనుభవం
హెచ్చరిక స్క్రీన్‌లు
అమలు
Facebookలో అందరికీ మేము ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాలను కలిగి ఉన్నాము.
సమీక్ష బృందాలు
Facebookలోని వ్యక్తులను సురక్షితంగా ఉంచడానికి 15,000 మంది సమీక్షకులతో కూడిన మా గ్లోబల్ బృందం ప్రతిరోజూ పని చేస్తుంది.
వాటాదారు ఎంగేజ్‌మెంట్
Facebook సామాజిక విలువలు, ప్రమాణాలను తెలియజేయడంలో బయటి నిపుణులు, విద్యావేత్తలు, NGOలు మరియు విధాన రూపకర్తలు సహాయపడతారు.
అప్రామాణిక ప్రవర్తనకు సంబంధించి సహాయం పొందండి
మా సామాజిక విలువలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేనినైనా మీరు Facebookలో చూసినట్లయితే, మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి.
మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి